క్రికెట్ లో కొన్ని మూమెంట్స్ ఎంత మీమ్ కంటెంట్ అవుతాయంటే వాటి రీచ్ చెప్పను కూడా చెప్పలేం. మీకందరికీ ఈయన గుర్తున్నారు కదా. పాకిస్థాన్ ఆటగాళ్ల ఆట చూసి ఫ్రస్ట్రేషన్ తో ఈయన నిలబడిన విధానం ఈ రోజుకీ పెద్ద మీమ్ కంటెంట్. అలాగే ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి చాలా సార్లు. ప్రత్యేకించి ఐపీఎల్ లో ప్రాంతాలవారీగా తమ ఫ్రాంచైజీలకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ గ్రౌండ్స్ లోనే చాలా సార్లు ఏడ్చేస్తారు. పిల్లలైతే మరీ ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక గుక్కపట్టేస్తారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ఎక్స్ ప్రెషన్స్ అయితే SRH మ్యాచ్ జరిగిన ప్రతీసారి డిబేటే. అలానే నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో కూడా ఓ అమ్మాయి వైరల్ గా మారిపోయింది. లాస్ట్ ఓవర్ లో 19 పరుగులు కొడితే చాలన్నప్పుడు మొదటి బంతికే సందీప్ శర్మ బౌలింగ్ లో ధోని క్యాచ్ ఇచ్చిన అవుటైపోయాడు. షిమ్రోన్ హెట్మెయర్ ఆ క్యాచ్ ను బౌండరీ లైన్ ముందు అద్భుతంగా అందుకున్నాడు. ఆ టైమ్ లో కెమెరాల్లో కనపడింది ఈ అమ్మాయి. ఆ క్యాచ్ అలా పట్టేశావేంట్రా అని హెట్మెయర్ మీద కోప్పడిందో..లేదా ధోనీ మళ్లీ ఫినిష్ చేయకుండా అయిపోయాడు అని చిరాకు పడిందో తెలియదు కానీ ఐదారు సెకన్ల గ్యాప్ లో ఆమె ఇచ్చిన ఈ ఎక్స్ ప్రెషన్స్ ఆమె ఆటలో ఇన్వాల్స్ అయిన విధానం ఏంటో చెప్పటంతో పాటు సోషల్ మీడియా లోనూ వైరల్ గా మారిపోయింది.